ఎన్నికల్లో మున్నూరు కాపులదే కీలక పాత్ర: పువ్వాడ అజయ్

ఎన్నికల్లో మున్నూరు కాపులదే కీలక పాత్ర: పువ్వాడ అజయ్

  మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్


ఖమ్మం టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలంటే మున్నూరుకాపుల పాత్ర కీలకమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర మున్నారు కాపు గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన ఆదివారం రాత్రి ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ పాల్గొని మాట్లాడారు. మున్నూరుకాపులు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని, వారి తీర్పు ప్రధానమైనదని అన్నారు.

మేలో రెన్యూవల్​చేస్తే వద్దిరాజు రవిచంద్ర మరో 6 రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారన్నారు. మున్నూరుకాపులను తాటిపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్​గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఆర్జేసీ కృష్ణను ఒడ్డున పడేస్తామని మంత్రి అన్నారు. తనతో హ్యాట్రిక్​కొట్టించాలని కోరారు. మున్నూరుకాపు ఓల్డేజ్ హోమ్, వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. కులం పేరు చెప్పుకోవడానికి భయపడే రోజుల నుంచి, గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగడం సంతోషం ఉందన్నారు. గాయత్రి గ్రూప్ నుంచి సొంత నిధులతో వంగవీటి రంగా విగ్రహం నిర్మిస్తానని చెప్పారు. మున్నూరు కాపు కార్పొరేషన్ తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, మెంతుల శ్రీశైలం, మేకల భిక్ష్మయ్య, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, గాయత్రి గ్రూప్ అధినేత వద్దిరాజు కిషన్, వైరా మున్సిపల్ చైర్ పర్సన్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నిర్మల్​హృదయ స్కూల్​ఆవరణలో నిర్వహించిన ప్రైవేట్​స్కూల్స్​ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్  పాల్గొన్నారు.  ఏఎస్ఆర్ జూనియర్ కాలేజీ, శాంతి నగర్ ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.